తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 'ఎకనామిక్ టైమ్స్' నుండి 'బిజినెస్ బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించడం ప్రతి తెలుగు బిడ్డకు గర్వకారణమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగూరు జోష్ణ శ్రీధర్ తెలిపారు. ఆదివారం కోదాడలో సీనియర్ మాజీ రాష్ట్ర నాయకులు ముత్తినేనీ సైదేశ్వరరావు నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడును కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, అద్భుతమైన విజన్ ఉన్న అడ్మినిస్ట్రేటర్‌గా ప్రపంచం గుర్తించిందని కొనియాడారు.