చిలుకూరు: ఆదర్శప్రాయుడు దొడ్డ నారాయణరావు

59చూసినవారు
చిలుకూరు: ఆదర్శప్రాయుడు దొడ్డ నారాయణరావు
సీపీఐ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు మృతి బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. శనివారం చిలుకూరులో అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డ నారాయణరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉన్నతమైన వ్యక్తిత్వం, పోరాట పటిమతో నారాయణరావు రాష్ట్రంలో నాయకునిగా గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్