
హర్మూజ్ జలసంధి గుండా పాక్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన 20 నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అంగీకరించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే నిర్మాణాత్మక చర్య అని, శాంతికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ రెండు పాకిస్థాన్ జెండా నౌకలు ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా వెళ్లేందుకు అనుమతి లభించింది.




