పురపోరులో ప్రచారం చేస్తున్న అభ్యర్థులు తమ సంస్కారాన్ని చాటుకున్నారు. 24వ వార్డు గులాబీ అభ్యర్థి గట్ల కోటేశ్వరరావు, హస్తం అభ్యర్థి చలపాటి శివకృష్ణ ప్రచారంలో తారసపడగా, ఇద్దరూ ఆత్మీయంగా కౌగిలించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికలు ఐదేళ్ల కోసమేనని, స్నేహబంధం శాశ్వతమని వారి తీరు నిరూపించింది. ఈ సందర్భంగా 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రంగమ్మ కూడా ఉన్నారు.