మోతే మండల సర్పంచులు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహకు వినతిపత్రం అందించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి, సీఐ శంకర్ నాయక్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిని అవమానించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచులు డిమాండ్ చేశారు.