అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండించాలి

4చూసినవారు
అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండించాలి
కోదాడలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయ గిరి, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ, అమెరికా సామ్రాజ్యవాద ఆకాంక్షతో ప్రపంచంలో శాంతి సామరస్యాలు లేకుండా చేస్తోందని ఆరోపించారు. ప్రపంచ శాంతికి భంగం కలిగించే చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మైసయ్యా, వీర బాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్