కోదాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పైడిమర్రి నారాయణరావును పట్టణ యాదవ సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. పట్టణంలోని నారాయణరావు నివాసంలో శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 32వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాదాల ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ వ్యాపార, సామాజిక రంగాల్లో సేవలందిస్తున్న నారాయణరావు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో యర్రా శ్రీనివాస్ బ్రదర్స్, చింతల ఉపేందర్, సతీష్, నాగలింగం, మణికంఠ, కేశవ, రామారావు తదితరులు పాల్గొన్నారు.