
ప్రధాని మోడీపై దాడికి విపక్షాల కుట్ర.. లోక్‌సభ సెక్రటేరియట్ బిగ్ స్టేట్‌మెంట్
లోక్‌సభ సెక్రటేరియట్ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. మహిళా విపక్ష ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆయన కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారని పేర్కొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొందరు మహిళా ఎంపీలు నేరుగా ట్రెజరీ బెంచీల వైపు దూసుకెళ్లి, ప్రధాని మోడీ కూర్చునే కుర్చీని చుట్టుముట్టారు. ప్రధానిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్య ఉందని ట్రెజరీ బెంచీ సభ్యులు ఆరోపించారు.




