కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల్లో విజయం సాధించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కోదాడలో జరిగిన సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో టి.పి.సి.సి. డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ చైర్మన్ సుధీర్ తిరుపతమ్మ, మహబూబ్ జానీ, బషీర్, ఎర్నేని బాబు, పారా సీతయ్య, ముత్తవరపు పాండురంగారావు, కందుల కోటేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.