రాష్ట్రవ్యాప్తంగా మండలానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికైన గుడిబండలో నిర్మించిన 110 ఇళ్లలో గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పసుపులేటి వీరలక్ష్మీ–నరసింహ దంపతుల నూతన గృహంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మూర్తి, ఆర్డీవో, ఎంఆర్ఓ, ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, తుమాటి నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, పులి వెంకటేశ్వర్లు, గ్రామ
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.