కోదాడ నియోజకవర్గంలో పేద, సామాన్య ప్రజల సంక్షేమానికి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతగిరి, చిలుకూరు, కోదాడ రూరల్, కోదాడ టౌన్, మోతే, మునగాల, నడిగూడెం మండలాలకు చెందిన 295 మంది లబ్ధిదారులకు రూ. 1, 22, 42, 850 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.