మే 4, 5 తేదీల్లో నియోజకవర్గ స్థాయి కత్రం లీగ్ కబడ్డీ పోటీలు

0చూసినవారు
మే 4, 5 తేదీల్లో నియోజకవర్గ స్థాయి కత్రం లీగ్ కబడ్డీ పోటీలు
కోదాడలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కత్రం కబడ్డీ లీగ్ సీజన్-1’ మండల స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 16న ప్రారంభమైన ఈ పోటీలలో కోదాడ, అనంతగిరి, నడిగూడెం, మోతే, చిలుకూరు, మునగాల మండలాలు, కోదాడ మున్సిపాలిటీ నుంచి జట్లు పాల్గొన్నాయి. గణపవరం, గోల్ తండా, బృందావనపురం, సిరికొండ, నారాయణపురం, బరాఖత్ గూడెం జట్లు తమ మండలాల్లో విజేతలుగా నిలవగా, కోదాడ మున్సిపాలిటీ స్థాయిలో తమ్మరబండపాలెం జట్టు గెలుపొందింది. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఎంపికైన జట్లతో మే 4, 5 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్