సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. వసంతాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు విడతల్లో 5,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, పైలట్ ప్రాజెక్టు కింద 1,023 ఇండ్లు మంజూరై 521 గృహప్రవేశాలు పూర్తయ్యాయని, కోదాడ పట్టణంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశామని, మరో 3 వేల మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, నిర్మాణాల్లో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.