చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంకు చెందిన డ్రైవర్ నజీర్, గత 11 ఏళ్లుగా నిరంతరాయంగా రక్తదానం చేస్తూ 53 సార్లు పలువురి ప్రాణాలను కాపాడారు. వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన ఆయన, రక్తం అందక బాధితులు పడుతున్న బాధలు చూసి చలించి రక్తదాన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. A1 బ్లడ్ డొనేషన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, ప్రమాద బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు సకాలంలో రక్తం అందేలా సమన్వయం చేస్తూ సేవలందిస్తున్నారు.