కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం గురువారం తన క్యాంపు కార్యాలయంలో కోదాడ రూరల్, టౌన్, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు మండలాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 444 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.