కోదాడ పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో కాన్వొకేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి డీజీఎం రమణా రెడ్డి విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు, క్రమశిక్షణ, కష్టపడి చదవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. నారాయణ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను బోధిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఏజీఎం రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ హరిత సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.