ఉపాధ్యాయుల జీతాల పై విద్యా కమీషన్ వ్యాఖ్యల పై ఖండన

9చూసినవారు
ఉపాధ్యాయుల జీతాల పై విద్యా కమీషన్ వ్యాఖ్యల పై ఖండన
విద్యా కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో “టీచర్లు, అధ్యాపకుల జీతాలు ప్రస్తుత మార్కెట్‌తో పోలిస్తే అధికంగా ఉన్నాయి” అని పేర్కొంటూ భవిష్యత్తులో సమీక్షించాలని సిఫార్సు చేయడాన్ని టిపిటిఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బడుగుల సైదులు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల మనోభావాలు, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు.
ఉపాధ్యాయుల జీతాలు అధికమని చెప్పడంలో కమిషన్ ఏ ప్రాతిపదికను అనుసరించిందో, ఎవరితో పోల్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్