సహకార సంఘాలకు వెంటనే డీఏపీ సరఫరా చేయాలి

0చూసినవారు
సహకార సంఘాలకు వెంటనే డీఏపీ సరఫరా చేయాలి
వానాకాలం సాగు పనులు ప్రారంభమైనా డీఏపీ, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు అవసరమైన డీఏపీ ఎరువులను తక్షణమే సరఫరా చేయాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు కోదాడలో ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు తగినంత డీఏపీ అందకపోవడంతో ప్రైవేట్ డీలర్లు బస్తాపై అదనంగా రూ. 300 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డీడీలు చెల్లించిన సంఘాలకు కూడా మార్క్‌ఫెడ్ అధికారులు ఎరువుల స్టాక్ విడుదల చేయడం లేదని విమర్శించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సహకార సంఘాలకు వెంటనే తగినంత డీఏపీ సరఫరా చేయాలన్నారు.

ట్యాగ్స్ :