కోదాడలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టంతో కేంద్ర నిధులు తగ్గి, రాష్ట్రాలపై భారం పెరిగి, కార్మికుల హక్కులు, మేట్ అసిస్టెంట్ల ఉపాధికి నష్టం కలుగుతుందని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.