మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు అభ్యర్థి కందుల కోటేశ్వరరావు అన్నారు. గురువారం 14వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. వార్డు సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, గెలిస్తే అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే పట్టణ అభివృద్ధి జరిగిందని, ఈసారి తనకు మద్దతు తెలపాలని కోరారు.