శ్రీ అభ్యంజనేయ స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణ

555చూసినవారు
శ్రీ అభ్యంజనేయ స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణ
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 208వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శీలా. అలివేలు మంగమ్మ, కాళ్ల. శ్రీనివాసరావు, నాగరాజు మరియు నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమారు 360 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి. హనుమంతరావు, వి. కృష్ణమూర్తి, సెక్రటరీ తిరుపతయ్య, లాస్యచరిత శిరీష, పెద్ది శేషు, నరేష్ ఆకుల, పుల్లారావు, పీ. శ్రీనివాసరావు, వి. రామారావు, ఆలయ అర్చకులు మరియు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్