శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధి లో అన్నప్రసాద వితరణ

14చూసినవారు
శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధి లో అన్నప్రసాద వితరణ
సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 215వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పొట్టుముత్తు విద్యాసాగర్ భారతి నాగరాజు లాస్యచరిత మరియు నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సుమారు 320 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి. హనుమంతరావు, ఆకుల పుల్లారావు, సెక్రటరీ తిరుపతయ్య, వీ రామారావు, పెద్ది శేషు, ఉమామహేశ్వర్రావు, శిరీష, పి. శ్రీనివాసరావు, రవీంద్ర, నరేష్, విశాల్, వెంకటకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్