గణనాథుడి ఉత్సవాల్లో అన్నదానం

1379చూసినవారు
గణనాథుడి ఉత్సవాల్లో అన్నదానం
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని 14వ వార్డు మదర్ తెరిస్సా స్కూల్ వీధిలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువత, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్