మాతృదేవోభవ చారిటబుల్ సొసైటీ కోదాడ, సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొండూరు మాధవి, శ్రీనివాస్‌ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం కోదాడ కోదండరామాలయం ఆవరణలో ఓ ఆర్యవైశ్య నిరుపేద కుటుంబానికి నెలరోజులకు సరిపడా నిత్యావసర కిరాణా సరుకులను పంపిణీ చేసింది. డైరెక్టర్ వెంపటి ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు పబ్బా గీతాదేవి, సెక్రటరీ రమాదేవి, కోశాధికారి ఇమ్మడి సతీష్‌బాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. డైరెక్టర్లు బండారు శ్రీనివాసరావు, సేకు శ్రీనివాసరావు, వంగవీటి రంగారావు, విజయ్ కూడా పాల్గొన్నారు.