కోదాడలో విద్యార్థులకు స్టీల్ గ్లాసులు, పండ్లు పంపిణీ

2చూసినవారు
కోదాడలో విద్యార్థులకు స్టీల్ గ్లాసులు, పండ్లు పంపిణీ
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని ఆజాద్‌నగర్‌లో ఆదివారం ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రం, ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్టీల్ గ్లాసులు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి బత్తిని కృష్ణమూర్తి పౌష్టికాహారం ప్రాముఖ్యతను, ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ లేదా గాజు వాడకాన్ని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you