సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పరిధిలోని రామాపురం వద్ద జాతీయ రహదారి 65పై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వరి ధాన్యం, ప్రభుత్వ బియ్యం, పశువులు, మద్యం, ఇసుక వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్పోస్ట్‌లో 24 గంటలూ కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్సై నవీన్, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి పాల్గొన్నారు.