నడిగూడెం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దున్న శ్రీనివాస్ ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.