శుక్రవారం కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి ఉత్తం, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% వాటా దక్కేలా తమ ప్రభుత్వం పోరాడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కొడంగల్, నారాయణపేట, డిండి, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, తమ ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. మోతె లిఫ్ట్ భూసేకరణలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.