కోదాడ పెద్ద చెరువు మత్స్య సొసైటీ ఎన్నికల నామినేషన్ గడువు శనివారం ముగిసింది. ఎస్సీ రిజర్వేషన్ డైరెక్టర్ పదవికి నలుగురు నామినేషన్ వేయగా, ముగ్గురు ఉపసంహరించుకున్నారు. వెంకట్రాంపురం గ్రామానికి చెందిన రేవల్ల సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 8 డైరెక్టర్లకు జూన్ 3న ఎన్నిక జరగనుంది.