మునగాల నామినేషన్ కేంద్రం పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

2చూసినవారు
మునగాల నామినేషన్ కేంద్రం పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ సోమవారం మునగాల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులకు ఆయన సూచించారు. నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మండల కేంద్రానికి అందించాలని అధికారులకు ఆదేశించారు.