ఏరువాక పూర్ణిమ సందర్భంగా మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ స్థానిక రైతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భూమి, పంట, పశువులను పూజించడం భారతీయ సంస్కృతి అని, వ్యవసాయం పవిత్ర యజ్ఞమని ఆయన అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పవాడని కొనియాడారు.