ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి.. బీజేపీ

1322చూసినవారు
ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి.. బీజేపీ
కోదాడ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బుధవారం మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెబోయిన వెంకటేష్‌బాబు, భూమా శ్రీనివాస్ ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించి, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దోపిడీని అరికట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్