పశు ఔషధ బ్యాంక్ తో రైతులకు రెండు కోట్ల ఇరవై లక్షలరూపాయల లాభం

7చూసినవారు
పశు ఔషధ బ్యాంక్ తో రైతులకు రెండు కోట్ల ఇరవై లక్షలరూపాయల లాభం
కోదాడ పట్టణ పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన వినూత్న 'పశు ఔషధ బ్యాంక్' ద్వారా పశుపోషకులకు భారీ ఆర్థిక లబ్ధి చేకూరింది. అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ఆలోచనతో, దాతల సహకారంతో ప్రారంభమైన ఈ బ్యాంక్ గత ఐదు మాసాల్లో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల మేర పశుపోషకులకు లాభం అందించింది. నాణ్యమైన డబుల్ స్ట్రెంత్ కాల్షియాన్ని లీటర్‌కు 50 రూపాయలకే అందించడం వల్ల మార్కెట్ రేటుతో పోలిస్తే రైతులకు భారీ ఆదా జరిగింది. ఇప్పటివరకు 18,500 లీటర్ల కాల్షియం పంపిణీ చేయగా, అదనపు పాల ఉత్పత్తితో కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సేవలకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పశుపోషకులు వస్తున్నారని దాత పుట్టగుంట కిరణ్‌ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్