భళా సూక్ష్మ కళా.... సుద్ధ ముక్క పై సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రతిమ

0చూసినవారు
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్‌చారి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కేవలం అంగుళం సుద్ద ముక్కపై పవన్‌ కళ్యాణ్‌ ప్రతిమను అద్భుతంగా చెక్కారు. అత్యంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కిన ఈ ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటోంది. పవన్‌ కళ్యాణ్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించినట్లు నరేష్‌చారి తెలిపారు. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్