సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని 35వ వార్డులో అభ్యుదయ యూత్ అధ్యక్షుడు తోటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. లక్ష్మీకటాక్షం కలగాలని కోరుతూ వినాయకుడి మెడలో పూజించిన రూ.10 నోట్ల దండలోని నోట్లను జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకులు కారింగుల అంజన్నగౌడ్ చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,
బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జి, వార్డు పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.