కోదాడలో అన్నదానం: కుసుమ వెంకటరత్నం బాబు చేతుల మీదుగా ప్రారంభం

2చూసినవారు
కోదాడలో అన్నదానం: కుసుమ వెంకటరత్నం బాబు చేతుల మీదుగా ప్రారంభం
కోదాడ నియోజకవర్గంలోని భవానీనగర్‌లో మంగళవారం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ముఖ్యఅతిథిగా హాజరై, గణేష్ విగ్రహం వద్ద అన్నదానాన్ని ప్రారంభించి, భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నదానం మహోన్నత సేవా కార్యక్రమమని, ఇది సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్