నేడు కోదాడ కు మాజీ మంత్రి హరీష్ రావు రాక... ఘనంగా ఏర్పాట్లు

1చూసినవారు
నేడు కోదాడ కు మాజీ మంత్రి హరీష్ రావు రాక... ఘనంగా ఏర్పాట్లు
కోదాడ పట్టణంలోని గునుగు అప్పయ్య ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పట్టణంలో భారీ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్ రావుకు స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు ఈ సమావేశానికి తరలి వస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :