కోదాడ పట్టణంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా, పోలీసుల ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా డ్రైవర్లు పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందించారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ డ్రైవర్లకు సూచించారు.