అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డా.లక్ష్మీప్రసన్న తెలిపారు. హెల్త్ మిషన్-100లో భాగంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు బీపీ, షుగర్, గుండె జబ్బులు, కంటి, దంత సమస్యలకు నిపుణులైన వైద్యులచే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.