గాంధీ జయంతి: కోదాడలో పేదలకు వస్త్రదానం

0చూసినవారు
గాంధీ జయంతి: కోదాడలో పేదలకు వస్త్రదానం
కోదాడ నియోజకవర్గంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు. సంఘం అధ్యక్షుడు చింతా బాబు మాదిగ మాట్లాడుతూ, గాంధీజీ, అంబేద్కర్‌ వంటి మహనీయులు స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పి. సత్యబాబు, మాజీ వార్డు సభ్యులు సీతారాం సింగ్, ఆనంద్‌శీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్