
భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.7,550 పతనమై రూ.1,56,400 పలుకుతోంది. ఇక కిలో వెండిపై రూ.10,000 తగ్గి రూ.4,15,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.




