బార్ అసోసియేషన్ ఉపాధ్యక్ష ఎన్నికలో గట్ల విజయం

1చూసినవారు
బార్ అసోసియేషన్ ఉపాధ్యక్ష ఎన్నికలో గట్ల విజయం
కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి సోమవారం జరిగిన ఎన్నికల్లో గట్ల నరసింహారావు 63 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి ఉయ్యాల నరసయ్యకు 41 ఓట్లు వచ్చాయి. మొత్తం 105 ఓట్లు పోలవ్వగా, నరసింహారావు 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారి రామకృష్ణారావులు ఈ ఫలితాలను ప్రకటించారు. నూతన ఉపాధ్యక్షుడికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్