వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి... గుండపు నేని

0చూసినవారు
వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి... గుండపు నేని
కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, బుధవారం 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుండపూనేని పద్మావతి నాగేశ్వరరావు వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేశానని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు ఈసారి కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :