అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీష ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ లెవల్-2లో పతకం సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. పేద కుటుంబం నుంచి వచ్చిన శిరీష దేశ రాజధానిలో విజయం సాధించడంపై గ్రామ సర్పంచ్ కలకండ లచ్చయ్య, ఉప సర్పంచ్ బండ్ల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. శిరీష విజయం గ్రామానికి గర్వకారణమని స్థానికులు కొనియాడుతున్నారు.