జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గొల్లమూడి రమేష్

2చూసినవారు
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గొల్లమూడి రమేష్
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మునగాల మండలం బరఖత్ గూడెం కు చెందిన గొల్లమూడి రమేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రమేష్ బాబు జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. జిల్లా అధ్యక్షునిగా రమేష్ బాబు జిల్లాలో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం వాళ్లు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మునగాల మండలం నరసింహుల గూడెం హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. రమేష్ బాబు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల పలువురు అధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, మిత్రులు, బంధువులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్