ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

726చూసినవారు
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆదివారం కోదాడ ఆర్టీసీ డిపోలో కార్మికుల డిమాండ్ల అంగీకారం సందర్భంగా, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా పనిచేస్తోందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, నాయకులు బి. పుల్లయ్య, చక్రపాణి, ఎస్. ఎస్. గౌడ్, అబ్దుల్, జానయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్