కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ, ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణంగా ఉందని ఆరోపించారు. రిటైర్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.