బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఆరు గంటల 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ వర్షం వరి మెట్ట పంటలకు ప్రాణం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం అన్నదాతల ముఖాల్లో సంతోషాన్ని నింపింది.