సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పలు సామాజిక, ధార్మిక, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం పాలకీడు మండలం చెరువు తండాలో వివాహ వేడుక, అమరవరంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం, హుజూర్‌నగర్‌లో మంజునాథ్ మార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కోదాడలో వివాహం, బారసాల, వాణి హాస్పిటల్‌లో పీడియాట్రిక్ విభాగం ప్రారంభోత్సవం, గృహప్రవేశం, నూతన పట్టు వస్త్రాలంకరణ, అన్నప్రాసన కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం గరిడేపల్లి మండలం వెలిదండలో స్వర్గీయ మేకల చిన్న పాపయ్య సంతాప సభలో పాల్గొని, అనంతరం కోదాడలో నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.