నడిగూడెం మండల కేంద్రంలో హోలీ వేడుకలు పిల్లలు, యువకులు, పెద్దలు కలిసి ఘనంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. స్థానిక యువత హోలీని కుల, మతాలకు అతీతమైన పండుగగా అభివర్ణించారు. వీధుల్లో యువత కేరింతలు కొడుతూ రంగులు చల్లుకోవడంతో ఊరంతా సందడిగా మారింది.